రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఏపీ తీరంపై వాతావరణ మార్పులు... రెండు రోజుల్లో అల్పపీడనం
- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం
- మన్నార్ గల్ఫ్ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- ఆంధ్రప్రదేశ్ తీర ప్రాతం వరకు విస్తరించిన వాతావరణ ద్రోణి
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. మన్నార్ గల్ఫ్, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే ఈ అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, మధ్య, ఎగువ స్థాయి పశ్చిమ గాలుల్లో కొనసాగుతున్న ద్రోణి కోస్తాంధ్రపై ప్రభావం చూపుతోంది. సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ద్రోణి... ఈశాన్య బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని మధ్య భాగాల వరకు విస్తరించి ఉంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.